: మంచి ముహూర్తాలు చూసుకుని తెలియజేస్తాను: కుమారుల వివాహంపై నాగార్జున స్పందన
తన కుమారులు నాగచైతన్య, అఖిల్ ల వివాహంపై టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జున తాజాగా స్పందించారు. తనయుల వివాహాలపై త్వరలో ఒక ప్రకటన చేస్తానని ఆయన అన్నారు. మంచి ముహూర్తం చూసుకుని, వారి వివాహాల వివరాలు తెలియజేస్తానని నాగార్జున తెలిపారు. చైతన్య, అఖిల్ ఇద్దరూ వారి జీవిత భాగస్వాములను ఎన్నుకోవడం తనకు, భార్య అమలకు చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, నాగ చైతన్య కథానాయిక సమంతను, అఖిల్ తన స్నేహితురాలు, ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ ను ప్రేమ వివాహాలు చేసుకుంటున్న సంగతి విదితమే.