: బి కేటగిరీ సీట్ల భర్తీలో 500 కోట్ల కుంభకోణం: ఏపీ సీపీఐ నేత రామకృష్ణ
ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్, నీట్ బీ కేటగిరీ సీట్ల కౌన్సిలింగ్ లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఏపీ సీపీఐ నేత రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో గత శనివారం నిర్వహించిన కౌన్సిలింగ్ ద్వారా వైద్య విద్యలో 667 బీ కేటగిరీ సీట్లను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సీట్లను అమ్ముకున్నారని ఆయన లేఖలో ఆరోపించారు. అందులో కేబినెట్ మంత్రుల భాగస్వామ్యం ఉందని ఆయన పేర్కొన్నారు. మెడికల్ సీట్ల అమ్మకాల్లో 500 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆయన లేఖలో ఆరోపించారు. సీట్ల కేటాయింపును తక్షణం రద్దు చేసి, ఆర్టికల్ 371 డి ప్రకారం కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.