: మోదీ ఎనర్జీ పాలసీ భేష్: చైనా అధ్యక్షుడి ప్రశంసలు
ప్రధాని నరేంద్ర మోదీ ఎనర్జీ పాలసీని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ మెచ్చుకున్నారు. రెండో రోజు జీ20 దేశాల సదస్సులో పాల్గొన్న సందర్భంగా మోదీ మాట్లాడుతూ, నల్లధనం, ఆర్థిక నేరాలను నియంత్రించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ఆర్థిక నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవినీతి, నల్లధనం, పన్నుల ఎగవేతలపై సరైన చర్యలు తీసుకున్నప్పుడు ఆర్థిక నేరాలు వాటంతట అవే తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక నేరాలపై పూర్తి స్థాయి నిబద్ధతతో పని చేయాలని ఆయన సూచించారు. అనంతరం మాట్లాడిన జీ జిన్ పింగ్ భారత ఆర్థిక విధానాల్లో మోదీ నాయకత్వాన్ని కోనియాడారు. అంతకు ముందు మోదీ బ్రిటన్ ప్రధాని థెరెసా మేను కలిశారు.