: సీఎంను విమర్శిస్తే ప్రజలు ఊరుకోరు: తలసాని
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శిస్తే ప్రజలు ఊరుకోరని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. గద్వాల, జనగాం జిల్లాలు ఏర్పాటు చేయాలని అఖిల పక్షం భేటీలో కాంగ్రెస్ ఎందుకు అడగలేదని ఆయన ప్రశ్నించారు. 'సెప్టెంబర్ 17' నిర్వహణపై బీజేపీ తమను విమర్శించడం సరికాదని ఆయన హితవు పలికారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఎవరైనా అడ్డుపడితే వారిని జైల్లో కూర్చోబెట్టి మరీ పనులు పూర్తి చేస్తామని ఆయన హెచ్చరించారు.