: ఆశారామ్ కు మళ్లీ నిరాశే!... బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు!
ఆశ్రమంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టైన ఆశారామ్ బాపూకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఆశారామ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ససేమిరా అంది. గత నెలలోనూ ఆశారామ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. తాజాగా ఆయన దాఖలు చేసుకున్న ఇంటెరిమ్ బెయిల్ పిటిషన్ ను విచారణకు తిరస్కరించిన కోర్టు... వైద్య పరీక్షల నివేదిక అందిన తర్వాతే బెయిల్ పిటిషన్ పై విచారణ జరుపుతామని తేల్చిచెప్పింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం సుప్రీం ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఆశారామ్ కు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఓ ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని ఎయిమ్స్ కు ఆదేశాలు జారీ చేసింది.