: కాంగ్రెస్ కు హరీశ్ రావు వార్నింగ్!... టీఆర్ఎస్ తలచుకుంటే ప్రతిపక్ష హోదా ఉండదని హెచ్చరిక!


తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తామే గనుక తలచుకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా గల్లంతేనని ఆయన వ్యాఖ్యానించారు.. జిల్లాల పునర్విభజనను శాస్త్రీయ పధ్ధతిలో చేస్తున్నామని చెప్పిన హరీశ్ రావు... తాము చేస్తున్న కసరత్తును అశాస్త్రీయమైనదిగా కాంగ్రెస్ అభివర్ణించడం అర్థరహితమని పేర్కొన్నారు. మెదక్ లో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా కాంగ్రెస్ తో పాటు టీడీపీ వైఖరిపైనా ఆయన నిప్పులు చెరిగారు. 50 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేస్తున్న తమ యత్నానికి అడ్డంకులు కల్పించిన వారు భవిష్యత్తులో గ్రామాల్లో అడుగుపెట్టలేరని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News