: ఖైరతాబాదు చేరిన సురుచి లడ్డూ!... కాసేపట్లో వినాయకుడి చేతిలోకి 500 కిలోల భారీ లడ్డూ!
ఖైరతాబాదులో కొలువుదీరిన భారీ గణనాథుడి చేతిలో పెట్టేందుకు తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ తయారు చేసిన 500 కిలోల భారీ లడ్డూ హైదరాబాదు చేరింది. నిన్న తాపేశ్వరం నుంచి ప్రత్యేక వాహనంలో బయలుదేరిన సురుచి ఫుడ్స్ లడ్డూ కొద్దిసేపటి క్రితం ఖైరతాబాదు చేరుకుంది. మరికాసేపట్లో ఆ లడ్డూ గణనాథుడి చేతిలోకి చేరనుంది. ఆరేళ్లుగా సురుచి ఫుడ్స్ నిర్వాహకులు ఖైరతాబాదు వినాయకుడి కోసం భారీ లడ్డూను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా సదరు సంప్రదాయానికి స్వస్తి చెప్పని సురుచి యాజమాన్యం ఈ ఏడాది కూడా భారీ లడ్డూను తయారు చేసి తన ప్రత్యేకతను చాటుకుంది.