: ఆర్బీఐ గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేప్టటిన ఉర్జిత్ పటేల్
భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా ఉర్జిత్ ఆర్.పటేల్ కొద్దిసేపటి క్రితం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆర్బీఐ గవర్నర్ గా తనదైన శైలిలో రాణించిన ప్రముఖ ఆర్థికవేత్త రఘురామ రాజన్ నిన్న పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. నిన్నటిదాకా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా పనిచేసిన ఉర్జిత్ పటేల్ ను ఆర్బీఐకి కొత్త గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ కసరత్తు చేసిన కేంద్రం పలువురు ఆర్థిక వేత్తల పేర్లను పరిశీలించి చివరకు ఉర్జిత్ పటేల్ వైపే మొగ్గు చూపింది. రఘురామ రాజన్ తో అత్యంత సన్నిహితంగా మెలగిన ఉర్జిత్... భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా చర్యలు చేపడతారని విశ్లేషకులు భావిస్తున్నారు.