: షిండే కథ, భారత్ కథ... రెండూ ఒకటే!: కాంగ్రెస్ సీనియర్ ను ఆకాశానికెత్తేసిన రాష్ట్రపతి!


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండేను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆకాశానికెత్తేశారు. అట్టడుగు వర్గం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన షిండే జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమేనని ప్రణబ్ కీర్తించారు. షిండే జన్మదినం సందర్భంగా నిన్న మహారాష్ట్రంలోని ఆయన సొంతూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రణబ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రణబ్ మాట్లాడుతూ... అట్టడుగు స్థాయి నుంచి షిండే అత్యున్నత స్థాయికి ఎలా ఎదిగారో... భారత ప్రస్థానం కూడా అలానే సాగిందన్నారు. ఎన్నో క్లిష్ట దశలను దాటుకుని భారత్ అభివృద్ది పథంలో దూసుకెళుతోందని, షిండే కూడా దేశం మాదిరే అత్యున్నత శిఖరాలకు చేరారని ప్రణబ్ కీర్తించారు.

  • Loading...

More Telugu News