: ఏపీలోనూ కొత్త జిల్లాలు!... నియోజక వర్గాల పునర్విభజన తర్వాతేనన్న ప్రత్తిపాటి!


కొత్త రాష్ట్రం తెలంగాణలో ఇప్పుడున్న 10 జిల్లాల సంఖ్య దసరా నాటికి 27కు చేరనుంది. ఈ విషయంపై తెలంగాణలో పెద్ద చర్చే నడుస్తోంది. ఈ క్రమంలో ఏపీలోనూ కొత్త జిల్లాలపై ఆ రాష్ట్ర మంత్రులు నోరు విప్పారు. నేటి ఉదయం గుంటూరులో వినాయకుడిని దర్శించుకున్న ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడుతూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఏపీలోనూ కొత్త జిల్లాల ఏర్పాటు జరగనుందన్న కోణంలో ఆయన పరోక్షంగా చెప్పుకొచ్చారు. అయితే దీనిపై కసరత్తు నియోజక వర్గాల పునర్విభజన జరిగిన తర్వాతే మొదలవుతుందని కూడా ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News