: 2019లోగా మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణం పూర్తి!: ఎయిమ్స్ డైరెక్టర్ నితిన్ ప్రకటన!
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి సమీపంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు కానున్న అఖిల భారతీయ వైద్య విఙ్ఞాన సంస్థ (ఎయిమ్స్) 2019లోగా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఇప్పటికే ఎయిమ్స్ కు ఏపీ సర్కారు మంగళగిరిలో భూములను కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ భూములను ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ నితిన్ నాగార్కర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కేంద్ర బృందం కొద్దిసేపటి క్రితం పరిశీలించింది. ఈ సందర్భంగా నాగార్కర్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ 2019లోగా మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. ఎయిమ్స్ నిర్మాణానికి సంబంధించిన టెండర్లను త్వరలోనే పిలవనున్నట్లు ఆయన పేర్కొన్నారు.