: ఖైరతాబాదు వినాయకుడికి గవర్నర్ తొలి పూజలు!... భాగ్యనగరిలో విఘ్ననాథుడి వద్దకు భక్తుల క్యూ!
భాగ్యనగరిలోని ఖైరతాబాదులో కొలువైన గణనాథుడికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సతీసమేతంగా తొలి పూజలు చేశారు. కొద్దిసేపటి క్రితం ఖైరతాబాదు వచ్చిన గవర్నర్ దంపతులకు తెలంగాణ సర్కారు తరఫున మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ దంపతులు వినాయకుడికి తొలి పూజలు చేశారు. తదనంతరం అప్పటికే అక్కడికి చేరుకున్న అశేష భక్తజనం వినాయకుడికి పూజలు చేశారు. అదే సమయంలో నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు మొదలుపెట్టారు.