: మాయావతిపై మరోమారు నోరు పారేసుకున్న దయాశంకర్!... యూపీ మాజీ సీఎంను కుక్కతో పోల్చిన బీజేపీ మాజీ నేత!


బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఉత్తరప్రదేశ్ శాఖ ఉపాధ్యక్షుడు దయా శంకర్ సింగ్... పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అయినా ఆయన తన నోటిని అదుపులో పెట్టుకునేందుకు సిద్ధంగా లేనట్టుంది. మరోమారు మాయావతిపై నోరు పారేసుకున్న ఆయన... ఈ దఫా యూపీ మాజీ సీఎంను కుక్కతో పోల్చారు. బైక్ వెంట పరుగెత్తే కుక్క.. బైక్ ఆగగానే పారిపోతుందన్న చందంగా మాయావతి తీరు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే మునుపటిలా కాకుండా ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే ఆయన మాట మార్చేశారు. తాను మాయావతిపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News