: ఏ... అంటే ఆంధ్రా, బీ...అంటే బాబు!: చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ ప్రశంసలు!


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి నిన్న ప్రశంసలు జల్లు కురిపించారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లిన కేఈ... మరో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పతో కలిసి జి.మేడపాడులో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ ఏపీలో అంతా ‘ఏబీసీ’ల గురించే మాట్లాడుకుంటున్నారని చెప్పారు. ఈ మూడక్షరాల అర్థాలను కూడా ఆయన సభికులకు వివరించారు. ఏ... అటే ఆంధ్రా అని, బీ... అంటే బాబు అని, సీ- అంటే కంప్యూటర్ అని ఆయన చెప్పారు. దీంతో సభకు హాజరైన వారంతా కరతాళ ధ్వనులతో కేఈ వ్యాఖ్యలను స్వాగతించారు.

  • Loading...

More Telugu News