: మరో ఘనత దిశగా బాలీవుడ్ నటి సన్నీలియోన్.. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్!
బాలీవుడ్ హాట్ నటి సన్నీలియోన్ అరుదైన గుర్తింపును దక్కించుకోనుంది. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై వయ్యారాలు ఒలకబోయనుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి బాలీవుడ్ నటిగా ఖ్యాతికెక్కనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. ప్రముఖ డిజైనర్ అర్చనా కొచ్చర్ రూపొందించిన వస్త్రాలను ధరించి ఫ్యాషన్‌లో పాల్గొననున్నట్టు సన్నీ పేర్కొంది. తాను రూపొందించిన ‘ఎ టేల్ ఆఫ్ టూ ట్రావెల్స్’ డిజైనర్ దుస్తులను సన్నీ కోసం ఇస్తున్నట్టు అర్చనా కూడా ట్వీట్ చేశారు. ఇక న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో హొయలు పోనున్న సన్నీ ఆ అదృష్టం దక్కినందుకు ఉబ్బితబ్బిబ్బవుతోంది.