: ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులో యువకుడి దారుణ హత్య.. ప్రత్యర్థుల పనేనని అనుమానం


ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. హత్యకు గురైన యువకుడు తమిళనాడులోని పట్టాభిరాం జిల్లా దేవరాజులపురానికి చెందిన సత్య(27)గా పోలీసులు గుర్తించారు. శనివారం రాత్రి జరిగిన ఈ హత్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సత్యవేడు మండలం పుదుకుప్పం సమీపంలో రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడి మృతదేహాన్ని చూసిన కొందరు కూలీలు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడే ఉన్న ఓ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. సత్య తలపై 17 కత్తిపోట్లు ఉన్నాయని, దుండగులు ఓ చేతిని నరికేశారని పోలీసులు తెలిపారు. సత్యపై ఇప్పటికే ఓ హత్యకేసు నమోదై ఉందని, ప్రత్యర్థులే అతడిని హత్య చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News