: రాజన్ స్థానంలో పటేల్!... ఆర్బీఐ గవర్నర్ గా ఉర్జిత్ బాధ్యతల స్వీకరణ నేడే!


భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ గా రఘురామ రాజన్ పదవీ కాలం నిన్నటితో ముగిసింది. రాజన్ స్థానంలో కొత్తగా ఆర్బీఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా కొనసాగుతున్న ఉర్జిత్... తాజాగా ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. రాజన్ పదవీ కాలం నిన్నటితోనే ముగిసిన నేపథ్యంలో నేడు ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజన్ వద్ద డిప్యూటీ గవర్నర్ గా పనిచేసిన ఉర్జిత్... రాజన్ మాదిరే దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా పనిచేస్తారనడంలో ఎలాంటి సందేహాలు లేవన్న విశ్లేషణలున్నాయి.

  • Loading...

More Telugu News