: దూకుడుగా ఆడుతున్న పాక్... ఇంగ్లండ్ స్కోరు 309/2
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా కార్డిఫ్ లో జరుగుతున్న చివరి వన్డేలో పాకిస్థాన్ జట్టు దూకుడుగా ఆడుతోంది. వికెట్లు పడుతున్నా రన్ రేట్ కిందికి జారకుండా జాగ్రత్త పడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో ఓపెనర్ జాసన్ రాయ్ (87), ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (75), బెయిర్ స్టో (33), హెల్స్ (23) ఆకట్టుకున్నారు. 303 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ జట్టు ఆకట్టుకుంటోంది. ఓపెనర్లు అజర్ అలీ (33), షెర్జిల్ ఖాన్ (10) శుభారంభం ఇవ్వగా, బాబర్ అజమ్ (31) ఫర్వాలేదనిపించాడు. షోయబ్ మాలిక్ (2), సర్ఫరాజ్ అహ్మద్ (1) క్రీజులో ఉన్నారు. 15 ఓవర్లలో పాక్ 79 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ చేతిలో వైట్‌వాష్ కాకుండా ఉండాలంటే పాకిస్థాన్ జట్టు ఈ మ్యాచ్ లో విజయం సాధించాల్సిన అసవరం ఉంది.