: డిసెంబర్ మొదటి వారంలో నా పెళ్లి!: ప్రకటించిన యువరాజ్ సింగ్


డిసెంబర్ మొదటి వారంలో తన వివాహం జరగనుందని టీమిండియా సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రకటించాడు. ముంబైలో కేన్సర్ ఛారిటీ కోసం ర్యాంప్ వాక్ నిర్వహించిన సందర్భంగా యువరాజ్ మాట్లాడుతూ, డిసెంబర్ మొదటి వారంలో హాజెల్ కీచ్ తో తన వివాహం జరుగుతుందని ప్రకటించాడు. కాగా, యువరాజ్ సింగ్ ప్రేయసి, బాలీవుడ్ నటి హాజెల్ కీచ్ తో గత ఏడాది ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. కేన్సర్ తో పోరాడి విజయం సాధించి, జట్టులో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న యువరాజ్ సింగ్ వివాహంపై ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారని, దాంపత్యం కూడా చేస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యువరాజ్ వివాహ ప్రకటన చేయడం సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News