: నయీంతో నాకెలాంటి సంబంధాలు లేవు... ఆరోపణలను మల్ రెడ్డి నిరూపించాలి: మంచిరెడ్డి కిషన్ రెడ్డి


కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీంతో తనకు సంబంధాలు లేవని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాజకీయ లబ్ధి కోసమే మల్ రెడ్డి రంగారెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయనకు దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. నేటి ఉదయం మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై మల్ రెడ్డి రంగారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నయీం ప్రధాన అనుచరుడు శ్రీహరితో కలిసి మంచిరెడ్డి కిషన్ రెడ్డి భారీగా అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. శ్రీహరిని అరెస్టు చేసిన పోలీసులు, మంచిరెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. శ్రీహరితో కలిసి మంచిరెడ్డి 300 కోట్ల రూపాయలు సంపాదించారని ఆయన ఆరోపించారు. ఆదిభట్లలో భూకబ్జా కేసులు బయటకు వస్తాయనే భయంతోనే ఆయన పార్టీ మారారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే అక్రమాలపై ఇబ్రహీంపట్నం చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News