: ఆ రెస్టారెంటులో సంస్కారానికి డిస్కౌంట్ ఇస్తారు!


దైనందిన జీవితంలో ఎన్నో చికాకులు, ఎంతో అసహనం... దీంతో వివిధ సందర్భాల్లో సంయమనం పాటించడం మర్చిపోతున్నాం. ఈ విషయాన్ని గుర్తించిన స్పెయిన్ లోని ఓ రెస్టారెంట్ సంస్కారానికి డిస్కౌంట్ ఇస్తూ ఆకట్టుకుంటోంది. తొమ్మిదేళ్లుగా బ్లావ్ గ్రిఫ్యూ రెస్టారెంట్ నడుపుతున్న మారిషల్ వాలెన్సికాకు వినియోగదారుల తీరు చూసి విసుగు వచ్చేసింది. సాటి మనుషుల పట్ల వారు ప్రవర్తిస్తున్న తీరుతో విసిగిపోయింది. దీంతో వారిలో సంస్కారాన్ని తట్టి లేపాలని, అందర్నీ గౌరవించడం నేర్పించాలని నిర్ణయించుకుంది. దీంతో తమ రెస్టారెంట్ లో సంస్కారం ప్రదర్శించిన కస్టమర్లకు డిస్కౌంట్ ఇవ్వడం ప్రారంభించింది. దీంతో ఆమె విజయం సాధించింది. ఇప్పుడు వారి రెస్టారెంట్ కు వెళ్లే కస్టమర్లు...అక్కడ సర్వీస్ అందించే సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడం లేదు. ఆర్డర్ చేసే ముందు ప్లీజ్ అని చెప్పడం, ఆర్డర్ తీసుకున్న తరువాత మర్చిపోకుండా ధాంక్స్ చెబుతున్నారు. ఇలా మర్యాదగా నడుచుకున్న కస్టమర్ల నుంచి కాఫీకి కేవలం 3.5 యూరోలు మాత్రమే ఆమె వసూలు చేస్తున్నారు. సంస్కారం మరచిన వారి నుంచి 5 యూరోలు వసూలు చేస్తున్నారు. కేఫ్ లో ఎంటర్ అవుతూనే అక్కడున్న వెయిటర్ కు హాలో...హాయ్...గుడ్ మార్నింగ్ వంటివి చెబితే కాఫీ కేవలం 1.30 యూరోలే. దీంతో అక్కడికి వచ్చే కస్టమర్లు సంస్కారవంతంగా నడుచుకుని బిల్లు తగ్గించుకుంటున్నారు. ఇలా ఈ కేఫ్ లో వ్యవహరించడం వల్ల తమ దైనందిన జీవితంలో కూడా ఎంతో మార్పు వచ్చిందని, ఇప్పుడు అందరితోనూ మర్యాదగా నడచుకుంటున్నామని పలువురు కస్టమర్లు పేర్కొనడం విశేషం.

  • Loading...

More Telugu News