: అనారోగ్యానికి గురైన డైరెక్టర్ మీరా నాయర్
అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినీ పరిశ్రమకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ అనారోగ్యానికి గురయ్యారు. 'క్వీన్ ఆఫ్ కట్వే' సినిమా రూపొందిస్తున్న ఆమె ఉగాండాలోని కంపాలాలో షూటింగ్ నిర్వహిస్తున్నారు. వచ్చే నెలలో ఈ సినిమాను విడుదల చేస్తానని గతంలో మీరా నాయర్ ప్రకటించడంతో మీడియా ప్రతినిధులు ఆమెను సినిమా విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా, ఆమె అనారోగ్యానికి గురయ్యారని ఆమె కుమారుడు తెలిపారు. కాగా, ఈ సినిమాలో ఆస్కార్ విజేత లుపిటా యోంగ్ నటిస్తోంది. దీనిని వచ్చే నెల విడుదల చేయాలని మీరా నాయర్ భావిస్తున్నారు.