: ముగిసిన అరుణ, లక్ష్మయ్యల రెండు రోజుల దీక్ష


మాజీ మంత్రులు డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య చేపట్టిన రెండు రోజుల దీక్ష ముగిసింది. గద్వాల, జనగామలను జిల్లాలుగా మార్చాలని డిమాండ్ చేస్తూ వీరిద్దరూ రెండు రోజులు నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీరికి అన్ని ప్రతిపక్ష పార్టీల నుంచి మద్దతు లభించింది. నేటి సాయంత్రం టీఎస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వారిద్దరికీ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా జిల్లాల విభజన పారదర్శకంగా లేదని పలువురు నేతలు ఆరోపించారు. స్వార్ధ ప్రయోజనాల కోసం జిల్లాలను విడగొడితే తరువాత పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు స్పష్టం చేశారు. ఏకపక్ష నిర్ణయాల వల్ల రాష్ట్రానికి మేలు జరగదని వారు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News