: ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా జిల్లాలు విభజిస్తున్నారు: కేసీఆర్ అన్న కుమార్తె రమ్య
ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా తెలంగాణలో జిల్లాలను విభజిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమార్తె రమ్య ఆరోపించారు. ఎంపీ కవిత నోటికి వచ్చినట్టు మాట్లాడడం సరికాదని ఆమె హితవు పలికారు. మాజీ మంత్రి డీకే అరుణ గడిలో కాదు గద్వాల ప్రజల గుండెల్లో ఉన్నారని ఆమె తెలిపారు. కవిత, కేటీఆర్ లు సిరిసిల్లకు గుదిబండల్లా తయారయ్యారని ఆమె విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత తప్ప జిల్లాల విభజన పట్ల ఎవరూ సంతోషంగా లేరని ఆమె తెలిపారు. టీఆర్ఎస్ రావణాసుర పార్టీ అని ఆమె విమర్శించారు. జిల్లాల ఏర్పాటులో ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె సూచించారు.