: వాటికన్ లో బెంగాలీ భాషలో ప్రార్థన!
రోమ్ లోని వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికా చర్చ్ లో నిర్వహించిన మదర్ థెరెస్సా సెయింట్ హుడ్ కాననైజేషన్ కార్యక్రమంలో బెంగాలీ భాష వినిపించింది. స్పానిష్ భాషను అధికారిక భాషగా పరిగణించే సెయింట్ పీటర్స్ బసిలికాలో పూజాది కార్యక్రమాల్లో అగ్రభాగం స్పానిష్ లోనే జరుగుతాయి. పోప్ ఫ్రాన్సిస్ కూడా ఆ భాషలోనే పూజ సమర్పించారు. అందులో భాగంగా మదర్ థెరెస్సా తన మాతృభాషగా భావించే బెంగాలీలో ఓ ప్రత్యేక ప్రార్థన చేశారు. సెయింట్ బసిలికాలోని ప్రధాన పూజలో ఇతర భాషలో ప్రార్థనను నిర్వహించడం విశేషమే. ఈ ప్రార్థనను మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి చెందిన సిస్టర్ చేశారు. ఈ సందర్భంగా అంతా మౌనంగా ప్రార్థన చేశారు.