: కాసేపట్లో ప్రారంభం కానున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరువు పోరాటం!
కాసేపట్లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరువు పోరాటం మొదలు కానుంది. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పాక్ జట్టు తొలి టెస్టు గెలిచిన ఆనందంలో హడావుడి చేసి విమర్శలు మూటగట్టుకుంది. అనంతరం ఇంగ్లండ్ పుంజుకుని పాక్ జట్టుకు దీటైన సమాధానం చెప్పింది. రెండు టెస్టుల్లో విజయం సాధించి, మిగిలిన రెండు టెస్టుల్లో చతికిలబడిన పాక్ జట్టు, తరువాత జరిగిన వన్డే సిరీస్ లో ఘోరంగా విఫలమైంది. ఇప్పటికే వన్డేల్లో 4-0 తో వెనుకబడిన పాక్ జట్టు కాసేపట్లో ప్రారంభం కానున్న చివరి వన్డేలోనైనా విజయం సాధంచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా టాస్ గెలిచిన పాక్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఓటమిపాలైతే ఇప్పటి వరకు మూడు సార్లు క్లీన్ స్వీప్ కు గురైన జట్టుగా పాక్ అపకీర్తి మూటగట్టుకుంటుంది. 1988లో వెస్టిండీస్ జట్టు చేతిలో క్లీన్ స్వీప్ కు గురైన పాక్ జట్టు, 2010లో ఆస్ట్రేలియా జట్టు చేతిలో క్లీన్ స్వీప్ అయింది.