: ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకోమని నీ తండ్రికే చెప్పు: కవిత విమర్శకు అరుణ ప్రతివిమర్శ


తనను గద్వాల కోటలో బొమ్మాళిగా అభివర్ణిస్తూ నిజామాబాద్ ఎంపీ కవిత చేసిన విమర్శలపై కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ మంత్రి డీకే అరుణ స్పందించారు. గద్వాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని నిన్నటి నుంచి నిరాహార దీక్ష చేస్తున్న ఆమె, మీడియాతో మాట్లాడుతూ, తనను విశ్రాంతి తీసుకోవాలని కవిత చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ, ప్రజా ప్రతినిధిగా తానెన్నడూ విశ్రాంతి తీసుకోలేదని, ఆమె తన తండ్రికే ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకోవాలని సలహా ఇస్తే మంచిదని విమర్శించారు. గద్వాలలోని కోట తమది కాదని ఆమె గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం జిల్లాల ఏర్పాటులో మొండి వైఖరి వీడాలని సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News