: 'పుల్లెల' అంటే అర్థాన్ని మరాఠీ భాషలో చెప్పిన సుమిత్రా మహాజన్


నెల్లూరులో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ వార్షికోత్సవాల్లో భాగంగా ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ లకు సన్మానం జరుగుతుండగా, ముఖ్య అతిథిగా పాల్గొన్న లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఓ ఆసక్తికరమైన అంశాన్ని చెప్పారు. పుల్లెల గోపీచంద్ ఉత్తమ శిక్షకుడని పొగుడుతూ, మరాఠీ భాషలో 'పుల్లెల' అంటే 'పూర్తిగా వికసించిన పుష్పం' (ఫుల్లీ బ్లోసమ్డ్) అంటూ, ఆయన బ్యాడ్మింటన్ నైపుణ్యం ప్రపంచమంతా ఓ సువాసనలా విస్తరించిందని అన్నారు. ఈసారికి రజత పతకాన్ని సాధించినప్పటికీ, వచ్చే ఒలింపిక్స్ లో సింధు స్వర్ణ పతకం తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు ఆమె వివరించారు. సుమిత్రా మహాజన్, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడుతుండగా, వెంకయ్యనాయుడు ఆమె ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించి చెప్పారు.

  • Loading...

More Telugu News