: ఓ బాబు, ఓ పాపకు జన్మనిచ్చిన యాంకర్ ఉదయభాను


టీవీ యాంకర్ ఉదయభాను పండంటి కవలలకు జన్మనిచ్చింది. నిన్న డెలివరీ నిమిత్తం బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆమె, రాత్రి ఓ బాబు, ఓ పాపకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. దాదాపు ఏడాదిగా బుల్లితెరకు ఉదయభాను దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. విజయవాడకు చెందిన విజయ్ అనే యువకుడితో వివాహమైన తరువాత పిల్లల కోసం ప్లాన్ చేశానని, ఇప్పుడు తొమ్మిది నెలలు నిండాయని, వారం పది రోజుల్లో కవలలకు జన్మనివ్వబోతున్నానని గత వారంలో ఉదయభాను మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News