: కాశ్మీర్ కు అఖిలపక్షం... విమానమెక్కిన టీడీపీ, టీఆర్ఎస్, వైకాపా ఎంపీలు


కాశ్మీర్ లో నెలకొన్న హింసాకాండను అదుపు చేసే మార్గాల అన్వేషణకు, వేర్పాటు వాద నేతలతో చర్చలు జరిపేందుకు హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం ఈ ఉదయం శ్రీనగర్ కు బయలుదేరింది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆహ్వానం మేరకు బయలుదేరిన ఈ బృందంలో దేశంలోని అన్ని ప్రధాన పార్టీల నేతలూ ఉన్నారు. ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఈ బృందంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, అంబికా సోనీ, ఎల్జేపీ నుంచి రాం విలాస్ పాశ్వాన్, జనతాదళ్ - యు నుంచి శరద్ యాదవ్, వామపక్ష పార్టీల నుంచి సీతారాం ఏచూరి, డి.రాజాలు ఉన్నారు. వీరితో పాటు ఎన్సీపీ నుంచి తారిఖ్ అన్వర్, సౌగతా రాయ్, శివసేన నుంచి సంజయ్ రౌత్, ఆనందరావ్, టీడీపీ నుంచి తోట నరసింహం, శిరోమణి అకాలీదళ్ నుంచి ప్రేమ్ సింగ్, బీజేడీ నుంచి దిలీప్ టిర్కే, ఏఐఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ, ఏఐయూడీఎఫ్ నుంచి బదరుద్దీన్ అజ్మల్, ముస్లిం లీగ్ నుంచి ఈ అహ్మద్, టీఆర్ఎస్ నుంచి జితేందర్ రెడ్డి, ఆర్ఎస్పీ నుంచి ఎన్.కె. ప్రేమచంద్రన్, ఏఐఏడీఎంకే నుంచి పి.వేణుగోపాల్, డీఎంకే నుంచి తిరుచ్చి శివ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వైవీ సుబ్బారెడ్డి, ఆర్జేడీ నుంచి జై ప్రకాశ్ యాదవ్, 'ఆప్' నుంచి ధరమ్ వీర్ గాంధీ, ఆర్ఎల్డీ నుంచి దుష్యంత్ చౌతాలా కాశ్మీర్ కు వెళ్లిన వారిలో ఉన్నారు.

  • Loading...

More Telugu News