: హ్యాపీ సండే... రెండున్నర గంటల పాటు రోడ్డెక్కి చిందులేసిన విజయవాడ యువత
విజయవాడ బందర్ రోడ్డులో నిర్వహించిన హ్యాపీ సండేలో భాగంగా యువత ఆడిపాడి చిందులేసింది. చిన్నా పెద్దా, ఆడా మగా తేడాలేకుండా ప్రతిఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని తమ నృత్యాలతో అందరినీ అలరించారు. పలు కాలనీల కమిటీలు, యూత్ అసోసియేషన్లు, కళాశాలలు హ్యాపీ సండేలో భాగం కాగా, ఉదయం ఆరు నుంచి 8:30 గంటల వరకూ రోడ్డుపైనే కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, స్కేటింగ్ ఆడుతూ, పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ నినాదాలు చేస్తూ, మట్టి వినాయకుడిని పూజిద్దామని ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు యువత ప్రయత్నించింది. రోడ్డుపై ఏర్పాటు చేసిన వేదికపై పాప్ సంగీతపు హోరులో యువతుల నృత్యాలు అందరినీ అలరించాయి. రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లతో పాటు పలువురు అధికారులు పాల్గొనగా, పోలీసులు ఆ రూట్ లో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.