: దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. 6.1 తీవ్రత
ప్రపంచాన్ని భూకంపాలు వణికిస్తున్నాయి. రోజూ ఎక్కడో ఓ చోట భూకంపాలు సంభవిస్తున్నాయి. పది రోజుల క్రితం ఇటలీలో సంభవించిన భూకంపంలో 200 మందికిపైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఉదయం దక్షిణ ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం కుదిపేసింది. మిండానయోలోని ఫిలిప్పీన్స్ ద్వీపంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే(యూఎస్‌జీఎస్) పేర్కొంది. హినాటాన్ పట్టణానికి వాయవ్యంగా 12 కిలోమీటర్ల దూరంలో భూమికి పది కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్టు తెలిపింది. ప్రాణ, ఆస్తినష్టంపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.