: ఏపీలోనూ టీఆర్ఎస్: ఎంపీ కవిత వ్యాఖ
భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనూ టీఆర్ఎస్ విస్తరించి ఎన్నికల్లో పాల్గొనే అవకాశాలు వస్తే మంచిదేగా! అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, కార్యకర్తల సంఖ్య పెరుగుతుంటే, ఏ ప్రాంతంలోనైనా టీఆర్ఎస్ బలపడుతుందని అన్నారు. ఇటీవలి కాలంలో కేటీఆర్, కవితలు ఆంధ్రా ప్రాంత ప్రజలకు సానుకూలంగా మాట్లాడుతూ ఉండటం, కవిత ఇటీవలి ఏపీ పర్యటనలను ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో ఆంధ్రా ప్రాంతంలో టీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉందా? అన్న ప్రశ్నకు 'అలా జరిగితే బాగుంటుంది కదా? అల్టిమేట్ గా కార్యకర్తలు బాగుపడతారు. పార్టీ బాగుపడుతుంది' అని కవిత చెప్పారు.