: కశ్మీర్‌ను శ్మశానంగా మారుస్తాం.. హిజ్బుల్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ హెచ్చరిక


మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ భారత్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశాడు. కశ్మీర్‌ను శ్మశానంగా మార్చేందుకు మరింతమంది కశ్మీరీలను ఆత్మాహుతి దళాలుగా మారుస్తామని పేర్కొన్నాడు. ప్రస్తుతం కశ్మీరులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సమయంలో వాటిని అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. కశ్మీర్‌లో శాంతి స్థాపనకు ఎటువంటి మార్గాలు లేవని ప్రభుత్వం, ప్రజలు, ముజాహిదీన్లు తెలుసుకోవాలన్నాడు. అక్కడ మిలిటెన్సీ తప్ప వేరే పరిష్కారం ఏదీ లేదని తేల్చి చెప్పాడు. కేంద్రమంత్రి రాజనాథ్ సింగ్ ఆధ్వర్యంలోని అఖిలపక్షం సభ్యులు కశ్మీర్‌ను సందర్శించడానికి ముందు హిజ్బుల్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తమ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాత కశ్మీర్‌లో ఉద్యమం తారస్థాయికి చేరుకుందన్నాడు. కశ్మీర్ అంశం లేకుండా చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. కశ్మీర్ ప్రస్తావన లేకుండా చర్చల వల్ల ఉపయోగం ఏంటని ఎదురు ప్రశ్నించాడు.

  • Loading...

More Telugu News