: మదర్ థెరీసాకు నేడు సెయింట్ హుడ్ ప్రదానం.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది హాజరు
కోల్‌కతా మురికివాడల్లోని అన్నార్తుల సేవలో తరించిన నోబెల్ బహుమతి గ్రహీత మదర్ థెరీసాకు పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో నేడు సెయింట్ హుడ్ ప్రదానం చేయనున్నారు. కాననైజేషన్ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలమందికిపైగా మదర్ అభిమానులు పాల్గొననున్నారు. భారత్ నుంచి కూడా పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ ఆధ్వర్యంలో 12 మంది సభ్యుల బృందం కాననైజేషన్‌లో పాల్గొననుంది. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మదర్ థెరీసా స్థాపించిన దేశవ్యాప్తంగా ఉన్న చారిటీ మిషనరీల నుంచి 50 మంది నన్స్ వాటికన్ సిటీకి తరలివెళ్లారు. కోల్‌తాలోని ఆర్చిబిషప్ థామస్ డిసౌజా ఆధ్వర్యంలో 45 మంది బిషప్‌లు కాననైజేషన్‌లో పాల్గొననున్నారు.