: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న మరణశిక్షల పర్వం.. మరో నేతకు ఉరి!

బంగ్లాదేశ్‌లో ఉరితీతల పర్వం కొనసాగుతోంది. 1971 యుద్ధ నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ప్రభుత్వం వరుసగా ఉరితీస్తోంది. ఇస్లామిస్ట్ పార్టీ అగ్రనేత ఒకరిని తాజాగా నిన్న రాత్రి ఉరితీసింది. జమాతే ఇస్లామీ పార్టీ నేత మిర్ ఖువాసెమ్‌ అలీని రాత్రి 10:30 గంటలకు ఉరి తీసినట్టు ఢాకాలోని కాశింపూర్ జైలు సూపరింటెండెంట్ ప్రశాంతో కుమార్ బోనిక్ తెలిపారు. 2010 నుంచి ఇస్లామిస్ట్ నేతలను ఉరితీస్తున్న ప్రభుత్వం ఇప్పటికి నలుగురిని ఉరితీయగా అలీ ఐదోవారు. 1971లో జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో పాకిస్థానీ సైనికులకు జమాతే ఇస్లామీ నేతలు సాయం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ పోరాటంలో ముప్పై లక్షల మంది చనిపోగా 2 లక్షల మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. ప్రధాని షేక్ హసీనా యుద్ధ నేరాలపై ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా దోషులుగా తేలిన వారిని ప్రభుత్వం వరుసగా ఉరితీస్తూ వస్తోంది.

More Telugu News