: గోదావరి పుష్కర తొక్కిసలాట దృశ్యాలు మాయం... జస్టిస్ సోమయాజులు ఆగ్రహం!


14 నెలల క్రితం గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి కీలక సాక్ష్యాలు మాయం అయ్యాయి. ఈ ఘటనపై విచారణ జరుపుతున్న జస్టిస్ సోమయాజులు కమిషన్ మూడవసారి విచారణను రాజమహేంద్రవరంలోని ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ లో చేపట్టిన వేళ, ఘాట్ లో తీసిన విజువల్స్ ఎడిట్ చేసి చూపారు. సీఎం, ఇతర భక్తుల స్నానాల దృశ్యాలు ఉన్నాయే తప్ప నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ తీసిన ఒరిజినల్ వీడియోను చూపలేదు. దీంతో సోమయాజులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎడిట్ చేయని దృశ్యాలను అందించాలని ఆదేశించారు. 9వ తేదీలోపు కమిషన్ కు ఆధారాలన్నీ ఇవ్వాలని అన్నారు. అత్యంత కీలక సాక్ష్యమైన వీడియోను ఎలా తొలగిస్తారని ఆయన ప్రశ్నించారు. కాగా, ఈ ఘటనలో 29 మంది మరణించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News