: అవును, నేను చనిపోయాను!: జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే చమత్కారం


జింబాబ్వే దేశాధ్యక్షుడు రాబర్ట్ ముగాబే చనిపోయారంటూ మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ‘అవును, నేను చనిపోయాను. మళ్లీ పునర్జన్మ ఎత్తాను’ అంటూ తొంభై రెండేళ్ల ముగాబే తనదైన శైలిలో చమత్కరించారు. తూర్పు ఆసియా వెళ్లాల్సిన ముగాబే విమానం దుబాయ్ వెళ్లిందని, ఆయన తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారని, దుబాయ్ లో చికిత్స పొందుతున్నారని, గుండెపోటు వచ్చిందని ఇలా పలు వదంతులు మీడియాలో చక్కర్లు కొట్టాయి. కొన్ని న్యూస్ ఛానెళ్లయితే అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, ఏకంగా ఆయనకు గుండెపోటు వచ్చిందని, అధ్యక్షుడి స్థానంలో బాధ్యతలు చేపట్టబోయే వ్యక్తి పేరును కూడా ప్రకటించేశాయి. కట్ చేస్తే.. హరారే విమానాశ్రయంలో రాబర్ట్ ముగాబే మీడియాతో మాట్లాడుతూ, కుటుంబ వ్యహారాల నిమిత్తం తాను దుబాయ్ వెళ్లానని చెప్పారు.

  • Loading...

More Telugu News