: మరో దుర్ఘటన.. జూబ్లీహిల్స్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కూలి పలువురికి గాయాలు
హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్‌ఎన్‌సీసీ) ఆవరణలో నిర్మాణంలోనున్న పోర్టికో భవనం కూలిన ఘటన మరువకముందే, ఈ రోజు జూబ్లీహిల్స్, రోడ్‌నెం.33లో నిర్మాణంలో ఉన్న మరో భవనం కూలిపోయింది. ఒక్కసారిగా భవనం పైకప్పు కూలిపోవడంతో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరు శిథిలాల కిందే చిక్కుకొని ప్రాణాలతో పోరాడుతున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఆరుగురిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కిందే చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి స్థానికులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు.