: ఇకపై పెల్లెట్ గన్స్ స్థానే మిరప గుణాలున్న పావాషెల్స్


కాశ్మీర్ లోయలో ఆందోళనకారులను నియంత్రించేందుకు పెల్లెట్ గన్స్ కు బదులు మిరప గుణాలున్న పావా షెల్స్ ను ఉపయోగించేందుకు కేంద్ర హోం మంత్రి రాజ్ నాత్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆందోళనకారులపై పెల్లెట్ల ప్రయోగంపై సర్వత్ర విమర్శలు తలెత్తిన నేపథ్యంలో కేంద్రప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, పెల్లెట్స్ కు ప్రత్యామ్నాయం సూచించాలని కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రసాద్ నేతృత్వంలో నిపుణుల సంఘాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను ఇటీవల హోంశాఖకు సమర్పించింది. పెలార్గానిక్ యాసిడ్ వెనైలిల్ ఎమైడ్ (పీఏవీఏ-పావా).. మిరప గుణాలున్న ఈ షెల్స్ వ్యక్తులను తాత్కాలికంగా కదలకుండా చేస్తాయి. అయితే, అఖిలపక్ష నేతలతో కలిసి కేంద్ర మంత్రి రాజ్ నాథ్ కాశ్మీర్ లో పర్యటనకు ముందు ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.

  • Loading...

More Telugu News