: ఢిల్లీ మాజీ మంత్రి సందీప్ కుమార్ సీడీల వ్యవహారంలో కొత్త ట్విస్ట్.. మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి అఘాయిత్యం చేశాడని మహిళ ఫిర్యాదు


ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రిగా ఉండి మ‌హిళ‌ల‌తో రాసలీలలు సాగించి, సంబంధిత సీడీల ద్వారా అడ్డంగా దొరికిపోయిన సందీప్ కుమార్ త‌న ప‌ద‌విని కోల్పోవడంతో పాటు ఆప్ నుంచి బహిష్కరణ‌కు కూడా గురైన విష‌యం తెలిసిందే. ఈ ఉదంతంలో రోజుకో ట్విస్ట్ ఎదుర‌వుతోంది. సందీప్ కుమార్‌ తమ ఉద్యోగేనని పోర్న్ వెబ్ సైట్ ‘పోర్న్ హబ్’ రెండు రోజుల క్రితం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న‌తో పాటు సీడీలో కనపడిన మహిళ ప‌లు ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. తాను మంత్రివ‌ద్ద‌కు రేషన్ కార్డ్ కోసం వెళ్లిన సమయంలో, మ‌త్తుమందు క‌లిపిన కూల్‌డ్రింక్‌ని ఇచ్చి సందీప్ కుమార్ త‌నపై అఘాయిత్యం చేశాడ‌ని ఆమె ఢిల్లీ సుల్తాన్‌పూరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు దీనిపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News