: పార్టీని నడపలేని అయోమయ స్థితిలో వైఎస్సార్సీపీ ఉంది: కళా వెంకట్రావు
పార్టీని నడపలేని అయోమయ స్థితిలో వైఎస్సార్సీపీ ఉందని ఏపీ టీడీపీ నేత కళా వెంకట్రావు విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై జగన్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిర్మాణాత్మక సలహాలివ్వాల్సిన వైఎస్సార్సీపీ ఈ విధంగా వ్యవహరించడం సబబు కాదన్నారు. ఏపీని ప్రగతి పథంలో ఆయన నడిపిస్తున్నారని, పంటలను కాపాడేందుకు అత్యాధునిక పద్ధతులను చంద్రబాబు పరిచయం చేస్తున్నారని కళా వెంకట్రావు పేర్కొన్నారు.