: జగన్.. నీ బాబు వల్లే కాలేదు, ఇక నీ వల్ల ఏమవుతుంది?: సోెమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని జైలుకు పంపాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ తహతహలాడుతున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ఓటుకు నోటు కేసులో చంద్రబాబును జైలుకు పంపాలని జగన్ చూస్తున్నారని అంటూ, 'నీ బాబు వల్లే కాలేదు.. ఇక, నీవల్ల ఏమవుతుంది?’ అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే వైఎస్సార్సీపీ ఈ తరహా దుష్ప్రచారాలకు పాల్పడుతోందన్నారు. చంద్రబాబును విమర్శించే హక్కు జగన్ కు లేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.