: శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికురాలి నుంచి బంగారం, నగదు కాజేసిన సిబ్బంది?


హైదరాబాద్ శివారులోని శంషాబాద్ విమానాశ్రయంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయానికి చేరుకున్న ఓ ప్రయాణికురాలి నుంచి కస్టమ్స్ సిబ్బంది 12 తులాల బంగారం, నగదును కొట్టేశారు. ఈరోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న పార్లమెంటులో పనిచేసే ఓ ఉద్యోగినిని ప్ర‌యాణికుల త‌నిఖీల్లో భాగంగా సిబ్బంది చెక్ చేశారు. ఆమె బ్యాగును తనిఖీ చేసిన సిబ్బంది తిరిగి ఆమె బ్యాగును ఆమెకు ఇచ్చేశారు. అయితే అందులో ఉన్న‌ బంగారం, నగదు చోరీకి గుర‌యిన‌ట్లు ఆ తర్వాత ఆ ప్ర‌యాణికురాలికి తెలిసింది. దీనిపై ఆమె శంషాబాద్ విమానాశ్ర‌య‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News