: ఖమ్మం జిల్లాలో పాడుబడ్డ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో బాలుడి మృతి
ఖమ్మం జిల్లా పాల్వంచ వికలాంగుల కాలనీలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఓ బాలుడి మృతదేహం పడి ఉండడం కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం అదృశ్యమైన సంతోష్ అనే ఎనిమిదేళ్ల బాలుడు వికలాంగుల కాలనీలోని ఓ పాడుబడ్డ ఇంట్లో మృతి చెందాడు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు ఆ మృతదేహం సంతోష్‌దిగా గుర్తించి స్థానిక పోలీసులకి సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాలుడి మృతిపై ఆరా తీస్తున్నారు.