: హైదరాబాద్ బోరబండ వాసికి 6 కిలోల శిశువు జననం
హైదరాబాద్ లోని బోరబండ వాసి 6 కిలోల శిశువుకు జన్మనిచ్చింది. నీలోఫర్ ఆసుపత్రిలో షబానా అనే మహిళ ఒక మగబిడ్డకు జన్మినిచ్చింది. సాధారణంగా అయితే పుట్టిన బిడ్డ బరువు 2 నుంచి 4 కిలోల మధ్య ఉంటుంది. కానీ, షబానా బిడ్డ మాత్రం ఇంత బరువు ఉండటం ఆశ్చర్యమేనని, తల్లీబిడ్ద ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.