: బైక్‌తో పాటు వాగులో కొట్టుకుపోయిన యువకుడు.. చివరికి చెట్టుని పట్టుకొని సురక్షితంగా బయటపడిన వైనం!
రంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల ధాటికి జిల్లాలోని శంకర్పల్లి మండలం ఫతేపురం వద్ద ఈసీవాగు పొంగిపొర్లుతోంది. ఈ క్రమంలో నీటి ధాటిని లెక్కచేయకుండా ఓ యువకుడు తన ద్విచక్రవాహనంతో పాటు నీటిలోనే రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. రోడ్డు సగం దాటిన తరువాత ద్విచక్రవాహనం సహా యువకుడు వాగులో కొన్ని మీటర్ల వరకు కొట్టుకుపోయాడు. కాసేపటి తరువాత ఓ చెట్టుని పట్టుకొని సురక్షితంగా బయటపడ్డాడు. అతడి ద్విచక్రవాహనం వాగులోనే కొట్టుకుపోయినట్లు సమాచారం.