: బోండా ఉమను కోగంటి చంపబోయారట!... బెజవాడ పారిశ్రామికవేత్తపై హత్యాయత్నం కేసు!


బెజవాడ డూండీ గణేశ్ ఉత్సవ సమితిలో నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. మొన్నటిదాకా గురుశిష్యులుగా ఉన్న పారిశ్రామికవేత్త కోగంటి సత్యం, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుల మధ్య పొడచూపిన విభేదాలు పోలీస్ స్టేషన్లకు కూడా చేరాయి. తాజాగా కోగంటిపై హత్యాయత్నం ఆరోపణల కింద ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదైంది. తనను కోగంటి చంపబోయారంటూ బోండా ఉమ ఇచ్చిన ఫిర్యాదు మేరకే తాము ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. మరి ఈ వివాదం ఎంతదాకా వెళుతుందో చూడాలి.

  • Loading...

More Telugu News