: హర్యానా మాజీ సీఎం భూపిందర్ ఇళ్లలో సీబీఐ సోదాలు!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ ఇంటిపై నేటి ఉదయం సీబీఐ అధికారులు సోదాలు ప్రారంభించారు. నేటి ఉదయం భూపిందర్ సింగ్ నిద్ర లేవకముందే ఆయన ఇంటి ముందు సీబీఐ అధికారులు ప్రత్యక్షమయ్యారు. మానేసర్ భూకుంభకోణంలో భూపిందర్ కు ప్రత్యక్ష ప్రమేయమున్నట్లు పక్కా ఆధారాలు సేకరించిన సీబీఐ అధికారులు ప్రస్తుతం ఆయన ఇంటిలో సోదాలు చేస్తున్నారు. అదే సమయంలో గుర్ గావ్, ఢిల్లీ, చంఢీగడ్ లలోని ఆయన బంధువుల ఇళ్లలోనూ సీబీఐ సోదాలు మొదలయ్యాయి.