: యువకుడిని బలి తీసుకున్న క్రికెట్ బెట్టింగ్!


క్రికెట్ బెట్టింగ్ ఆస్తులనే కాకుండా వ్యక్తుల ప్రాణాలను కూడా బలి తీసుకునే ప్రమాదకర స్థితికి చేరుకుంది. క్రికెట్ బెట్టింగ్ పట్ల ఆకర్షితుడైన ఓ యువకుడు నిండా అప్పుల్లో మునిగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రవిప్రసాద్ క్రికెట్ బెట్టింగ్ పట్ల ఆకర్షితుడయ్యాడు. బెట్టింగ్ కోసమంటూ స్నేహితుల వద్ద అందిన కాడికి అప్పులు చేశాడు. ఓ స్థాయి మేరకు అప్పులు ఇచ్చిన స్నేహితులు ఆ తర్వాత వాటిని వసూలు చేసుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అప్పటికే నిండా అప్పుల్లో కూరుకుపోయిన రవిప్రసాద్ కు అప్పులు ఎలా తీర్చాలో తెలియలేదు. దీంతో అతడు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. నేటి ఉదయం వెలుగుచూసిన ఈ ఘటన మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

  • Loading...

More Telugu News